పెట్టుబడుల కోసం విదేశాల పర్యటన

*పెట్టుబడుల కోసం సీఎం అమెరికా పర్యటన చేస్తే కౌశిక్ రెడ్డి విమర్శించడం సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్*

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 11*

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో 8 రోజులు దక్షణ కొరియాలో రెండు రోజులు పర్యటించి దాదాపుగా 52 సమావేశాలకు హాజరై 50వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకొని ప్రధానమైన కంపెనీ అయినటువంట కార్గిజెంట్ హైటీ కంపెనీ వాష్ కర్ర హోల్డింగ్స్ ప్రముఖ కంపెనీలతో సమావేశమై పెట్టుబడులకు ఆహ్వానించిన సీఎం ఈ కంపెనీ ఏర్పడడం వలన తెలంగాణలో ఉన్నటువంటి 50 వేల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అదేవిధంగా దక్షణ కొరియాలోని ఎల్జి సాంసంగ్ కంపెనీ తో ఒప్పందం ఏర్పరచుకొని దేశంలో ఉన్నటువంటి అగ్ర కంపెనీలను తెలంగాణలో ఏర్పాటు చేసి చైనాతో పోటీపడే విధంగా అభివృద్ధి సాధించడం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సీఈఓ లతో వ్యాపారవేత్తలతో చర్చలు జరుపుతున్నారని తెలంగాణ నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యడానికే చర్చలు జరుగుతున్నాయని ఇలాంటి విషయాలకు సానుకూలంగా స్పందించడమే కాకుండా వక్రీకరించడం చాలా దురదృష్టకరమైన గడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో చింతల ఐలయ్య గొర్ల సునీల్ గడ్డి అయిలయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now