Site icon PRASHNA AYUDHAM

రోటరీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్

IMG 20250721 181157

*రోటరీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 21

 

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినారు. కామారెడ్డి లోని స్థానిక మార్కండేయ మందిరం ప్రాంగణంలో రోటరీ గవర్నర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ దృశ్ట్యా, వర్షాకాలం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా రోటరీ 3150 గవర్నర్ డా|| ఎస్వీ రాంప్రసాద్ , అసిస్టెంట్ గవర్నర్ డా||ఎమ్ .జైపాల్ రెడ్డి మరియు అధ్యక్షులు శంకర్, కార్యదర్శి కృష్ణ హరి, ట్రెజరర్ రమణ మరియు సభ్యులు రాజనర్సింహారెడ్డి, శ్రీశైలం, నాగభూషణం, కాశీనాథం, కాశినాథ్ రావు, దత్తాద్రి మరియు ఇతర సభ్యులు, చాట్ల రాజేశ్వర్, రాజేందర్, దామోదర్, నరసింహ స్వామి, పూజారులు పాల్గొన్నారు. అందరి సమన్వయంతో మార్కండేయ మందిరంతో పాటు మూడు చోట్ల రాగి, వేప, మేడి, జువ్వి, మర్రి లాంటి మొక్కలు సుమారు వంద నాటామని తెలియజేశారు. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కటి వృక్షాలుగా ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Exit mobile version