*ఎమ్మెల్సీ అభ్యర్థిని సన్మానించిన …ట్రెస్మా జిల్లా కోశాధికారి నిస్సి శామ్సన్…*
కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుని ఘనంగా సన్మానించిన ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్ యాజమాన్యం.
ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్లో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ని స్కూల్ డైరెక్టర్ ,ట్రెస్మా జిల్లా కోశధికారి నిస్సి శామ్సన్. ఘనంగా సన్మానించారు . ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వెళ్తూ మార్గమధ్యంలో ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం యాదగిరి శేఖర్, రాములు లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి ప్రైవేట్ పాఠశాలలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై ట్రెస్మా మాజీ అధ్యక్షుడి గా చీఫ్ అడ్వైజర్ గా ఎన్నో రకాల పోరాటాలు చేసి విజయాలు సాధించడం జరిగిందని తెలిపారు. ఇదే కాకుండా అనేక రకాల సామాజిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేశాను మహిళలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని భవిష్యత్తులోను చేస్తానని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేసి మీతో ఒక సేవకునిగా ఉంటూ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు.కామారెడ్డి లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు అందరూ నా విజయం కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ మరియు ట్రస్మా జిల్లా కోశాధికారి నిస్సి శాంసన్ మరియు జిల్లా ట్రస్మా నాయకులు పాల్గొన్నారు.