గిరిజన రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి!

*గిరిజన రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి!*

*నాగర్ కర్నూలు జిల్లా:మే 19*

ఇందిర సౌర గిరి జల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.5.7.5 హెచ్ పి పంపుసెట్లు ఇస్తామన్నారు. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి….

నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్రాబాద్ మండలంలోని మాచారం చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు.

తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేప థ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జల‌కళను తెచ్చేందుకే సర్కార్ ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

రాబోయే ఐదేళ్లలో 2.10 లక్షల ఎకరాల పోడు భూముల్లో సాగుకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్‌ సెట్లను అందజేయను న్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా బలంగా చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకం వర్తించనుంది…

గిరిజన రైతుకు 2 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే.. సమీప రైతులను కలిపి బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు.

ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభో త్సవం సందర్భంగా గిరిజన రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవ సాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని అన్నారు.

అదేవిధంగా అదనంగా వచ్చే సోలార్ విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మాలని ఆయన సూచించారు. గిరిజన రైతులు ఒకే పంట మీద ఆధారపడొద్దని.. వివిధ రకాల పంటలను సాగు చేయాలన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

సోలార్ పంపు సెట్ల ఏర్పాటులో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు పంపు సెట్లు ఇస్తామన్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇన్నాళ్లు విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు విద్యుత్ శాఖతో గిరిజన రైతులకు తీవ్ర ఇబ్బందులు ఉండే వని.. ఇకనుంచి ఎవరికీ ఇటువంటి ఇబ్బందులు ఉండవు అన్నారు.

Join WhatsApp

Join Now