భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ ఎదురుగా ధర్నా చౌక్ లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి నాయుకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయాలని,ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టి,ఎస్సి, బిసి మైనారిటీ పేద విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకోవడానికి వీలుంటుందని,గొండ్వన సంక్షేమ పరిషత్ బృందం నెల రోజులు నుండి 12 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఐటిడిఏ పిఓ మరియు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన కూడా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని అన్నారు,తక్షణమే ప్రభుత్వం స్పందించి వారు చేస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంకి అశ్వరావుపేట నియోజకవర్గం జెఏసి నాయకులు కూడా మద్దతు తెలిపారు.