Site icon PRASHNA AYUDHAM

సారపాకలో ఘనంగా గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం

సారపాకలో ఘనంగా గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఈవో మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్బంగా గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ.దేశం యావత్తూ ఇవాళ భగవాన్ బిర్సా ముండా జయంతిని భక్తి, గౌరవాలతో నిర్వహించుకుంటోంది అని ముందుగా భరతమాత విశిష్ట పుత్రుడు, అసమాన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కొనియాడారు. నవంబర్ 15 భారతదేశపు గిరిజన సంప్రదాయానికి ఉజ్వలమైన రోజు అని గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ “జన జాతీయ గౌరవ దివాస్”నవంబర్ 15వ తేదీని‘గిరిజన జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా సంభందిత గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు.. జరుపబడుతాయి అని పేసా చట్టం మరియు ఫారెస్ట్ రైట్ యాక్ట్ (FRA) ల పై అవగాహన కార్యక్రమం అంతే గాక GPDP మరియు PDI ల పై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపురం ఎస్టి కాలనీ రోడ్డు సమస్య ఎమ్మెల్యే సాయం గారు 30 లక్షలు శాంక్షన్ చేశారని కానీ ఫారెస్ట్ వాళ్లు అభ్యర్థన పెట్టడంతో ఆ రోడ్డు పెండింగ్లో ఉందని… అలాగే గిరిజనులకు విద్య,వైద్యం,కరెంటు లాంటి మౌలిక వసతులు కల్పించాలని చర్చించారు అనంతరం మాజీ సర్పంచ్ గలిగా పున్నమ్మకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి,
మైనార్టీ అధ్యక్షులు మహిముద్ ఖాన్, ఉపాధ్యక్షులు కనితి కృష్ణ, సిపిఐ జిల్లా నాయకులు పేరాల శ్రీను, సిపిఐ నాయకులు లడ్డ, (వెంకటేశ్వర్లు), సిపిఎం జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, మాజీ సర్పంచ్ పున్నమ్మ, నియోజకవర్గ యూత్ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకురాలు కర్రి కామేశ్వరి కాంగ్రెస్ నాయకులు తిరుపతి చంటి, ఓబుల్ రెడ్డి,మల్లి కృష్ణ, వీరారెడ్డి నాగరాజు,రహీం ఖాన్, శంకర్, రమణారెడ్డి, కొనకంచి శ్రీను, ఏసోబు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version