Site icon PRASHNA AYUDHAM

మెగా డీఎస్సీ నుండి గిరిజన ప్రాంత పోస్టు లు మినహాయింపు చేసి ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి

IMG 20250517 WA2128

*మెగా డీఎస్సీ నుండి గిరిజన ప్రాంత పోస్టు లు మినహాయింపు చేసి ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి*

*ఎజేఏసీ పార్వతిపురం మన్యం జిల్లా కమిటీ*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 17 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఎజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటీడీఏ ఎదుట ఆదివాసి సంఘాల ఐక్య కార్యచరణ సమితి (ఏజేఏసీ) పార్వతిపురం మన్యం జిల్లా తరఫున శనివారం రిలే నిరాహార దీక్ష ముడువ రోజు కొనసాగించడం జరిగింది

ఈ నిరాహార దీక్షలో ఇటీవల డీఎస్సీ 2025 మెగా డీఎస్సీలో 881 గిరిజన ప్రాంత పోస్టులు కలిపిన నేపథ్యంలో ఆ పోస్టులును మినహాయింపు చేసి ఐటీడీఏ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసిల తోనే నియామకాలు చేపట్టాలని, *ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి (టిఏసి)* తక్షణమే ఏర్పాటు చేసి రద్దయిన జీవో నెంబర్ మూడు స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చి గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకు వచ్చే విధమైన చట్టం తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని, ఈ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ప్రభుత్వానికి కోరడమైనది. లేనిపక్షంలో ఈ పోరాటం మరింత ఉదృతంగా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైర్మన్ కొండగొర్రి ధర్మారావు, ఆరిక నీలకంఠం సెక్రెటరీ కె. జయన్న , వైస్ చైర్మన్ లు డి సీతారాం, రామకృష్ణ, చంద్రశేఖర్, మల్లయ్య, గిరిధర్, సాయిబాబు, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు టి సత్యనారాయణ, వై.సూర్యనారాయణ, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

Exit mobile version