తెలంగాణ గిరిజన గురుకుల ఉపాధ్యాయుల నల్లబ్యాడ్జీలతో నిరసన..
18 19 తేదీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన
-22 23 తేదీలలో మేమరండం సమర్పణ
-28వ తేదీన హైదరాబాదులో మహా ధర్నా
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 18:
బాన్సువాడ నియోజకవర్గం లోని నసర్లబాద్ మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల పాఠశాలలో బుధవారం నల్ల బ్యాడ్జీలు దరించి వారి నిరసనను వ్యక్తం చేయడం జరిగింది,. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన, మైనారిటీ తదితర అన్ని గురుకుల పాఠశాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు, దంతోపాటుగా పాఠశాల పని వేళలు పాతవే ఉంచాలని కోరారు, విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని, రాత్రి పనివేళలు తీసివేయాలని,పదవ తేదీన కాకుండా వారికి ఒకటవ తేదీని జీతాలు వేయాలని వారు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల ను నెరవేర్చక పోయిన యెడల ఈనెల 18 19 తేదీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని అదేవిధంగా ఈనెల 22 23 తేదీలలో మెమొరండం సమర్పిస్తామని తదుపరి 28వ తేదీ హైదరాబాదులో మహా ధర్నా నిర్వహిస్తామని వారు తెలియజేయడం జరిగింది.