తాళ్లూరి శ్రీనివాస్ అకాల మరణం బాధాకరం
మాదిగ ఐక్యవేదిక
అనారోగ్య కారణంగా మృతి చెందిన సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామ నివాసి ,అందరికీ సుపరిచితుడు, అమరజీవి” తాళ్లూరి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సుజాతనగర్ మండలం మాదిగ ఐక్యవేదిక నాయకులు సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు స్పందిస్తూ ,తాళ్లూరి కుటుంబం సుజాతనగర్ మండల దళిత సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించిందని శ్రీనివాస్ తండ్రి మండల దళిత వర్గానికి పెద్దదిక్కుగా ఉంటూ శుభకార్యాలు ఆశుభ కార్యాలు నిర్వహించే వారని” శ్రీనివాస్ తల్లి గారు గతంలో ప్రజా ప్రతినిధిగా గెలిచి ఆ ప్రాంత ప్రజలకు సేవలందించారని శ్రీనివాస్ ఆర్ఎంపి వైద్యునిగా మండలంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వృత్తిపరంగా సేవ చేశారని అన్నారు. తాళ్లూరి వారి కుటుంబం మొత్తం ప్రజల సేవకే అంకితమైందని కొనియాడారు “ఏది ఏమైనా శ్రీనివాస్ మరణం బాధాకరమని, దళిత సమాజానికి వారి మరణం తీరని లోటని ,ఆ లోటు ఎవరూ పూడ్చ లేనిదని అన్నారు ,ఐక్యవేదిక తరపున వారి కుటుంబానికి ప్రగాఢ అనుభూతి తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ ,ఉపాధ్యక్షులు అంకి శెట్టి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తడికమల్ల దిలీప్ ,గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న కాకటి బాబు, ప్రత్యేక ఆహ్వానితులు మంద రాజు సిద్దెల నరేందర్ కొండ్రు వెంకటేశ్వర్లు ,మండల నాయకులు మురిపిటి కన్నయ్య ,గ్రామ నాయకులు గరిక ఉపేందర్ ,వేల్పుల రాజు ,దంసలపూడి పవన్, మురిపిటి నాగయ్య ,మంద నరసింహ ,కొండ్రు ప్రవీణ్, అంకి శెట్టి సాయి నాగు ,మంద ఉమాశంకర్, కొంగల రాంబాబు, తడికమల్ల మల్లేష్, తాళ్లూరి వెంకటేశ్వర్లు ,శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు.