పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు ఘన నివాళి.
వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్
సిద్దిపేట ఆగస్టు 8 ప్రశ్న ఆయుధం :
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు అమర జీవి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఈరోజు ఉదయం మరణించారు. వారికి మృతికి సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సంతాపం ప్రకటించి ఘన నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ మాట్లాడుతూ బుద్ధదేవ్ భట్టాచార్య మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. ఆయన యువజనుడిగా ఉన్నప్పటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. సుదీర్ఘకాలంపాటు మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌కు సేవలందించారని వివరించారు.ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి క్రియాశీలకపాత్ర పోషించారని అన్నారు. ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, చొప్పరి రవికుమార్, జాలిగపు శిరీష, జిల్లా నాయకులు గొర్రె శ్రీనివాస్, రవీంద్ర చారి, కొండం సంజీవ్ కుమార్, వంగ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.