గజ్వేల్ సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం
గజ్వేల్ మండల కేంద్రంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ కాలనీలో సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వ వర్థంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివలింగు కృష్ణ మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ పోరాట పటిమ, తెగువతనంతో అలుపెరుగని పోరాటం చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత అని తెలిపారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి గా పేర్కొన్నారు. కావున చాకలి ఐలమ్మ గారి లాంటి పోరాట పటిమ నేటి సమాజానికి స్పూర్తి దాయకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములఘట్ రజక సంఘం అధ్యక్షులు, పల్లెపహాడ్ గ్రామ సిపిఐ పార్టీ నాయకులు పోచయ్య, రాజం, బిక్షపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.