వైద్యులు విజేంద్ర రావు భౌతిక కాయానికి నివాళలు

IMG 20240912 WA2289

కొత్తగూడెం పట్టణ ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్యులు విజేందర్ రావు 95 సంవత్సరాలు బుధవారం మధ్య రాత్రి అయినా స్వగృహంలో స్వర్గీయులైనారు. వారికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ గురువారం పూలమాలలు వేసి జోహార్లు అర్పించి విజేందర్ రావు సేవలను కొనియాడారు. అంబేద్కర్ వాది, మానవతావాది, అయినా వైద్య వృత్తిలో ఎందరికో ఎన్నో సేవలు చేసిన మహా వ్యక్తిని తెలియజేశారు. ఆయనకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి తరపున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అయినా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పు కలగజేయాలని కోరారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఉద్యోగ సంఘాల నాయకులు కొమ్ము శ్రీరాములు,బీఎస్పీ పార్టీ నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ సూరి, మాదిగ ఐక్య సంఘాల వేదిక నాయకులు వేల్పుల భాస్కరు, షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కత్తి బాలకృష్ణ, మాల మహానాడు జిల్లా నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now