ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన ఎస్సై ఆనంద్ రావు కి సన్మానం..

గత పదేళ్లుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంటెలిజెన్సీ ఎస్ఐగా పనిచేసి పదవి విరమణ పొందిన ఆనందరావును శనివారం పెద్ద ఎత్తున సన్మానించారు ఇంటెలిజెన్సీ పోలీసులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారని ఆనందరావు ని చూసి ప్రజలకు అర్థమైందని మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర రావు అన్నారు సదాశివ నగర్ గాంధారి రామారెడ్డి మండలాలకు చెందిన నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఎస్సై ఆనంద్ రావు ను ఆయన సతీమణి ని శాలువలతో సన్మానించి స్వీట్ తినిపించారు గ్రామీణ ప్రజల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి అటు ప్రభుత్వానికి చేరవేసి కొన్ని సమస్యలను పరిష్కారం అవ్వడానికి కారణమైన ఎస్ఐ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు పదవి విరమణ అనంతరము ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.
గాంధారి టిఆర్ఎస్ అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సదాశినగర్ మాజీ ఎంపీపీ హనుమండ్ల రాజయ్య ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ గంగారాం మద్దికుంట మాజీ ఎంపీటీసీ రాజేందర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయకులు టంకరి రవి, తిరుపతి ,కిరణ్ కుమార్ రెడ్డి లింబాద్రి నాయక్ లింగారెడ్డి , జంగం లింగం గొల్ల మల్లేష్, రెడ్డి మల్లేష్ , ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు