భారత మాజీ ప్రధాన మంత్రి చిత్ర పటానికి ఘన నివాళి

*భారత మాజీ ప్రధాన మంత్రి చిత్ర పటానికి ఘన నివాళి*

*బాలాపూర్ వద్ద కొవ్వాతులను వెలిగించి నివాళులు అర్పించిన యువజన కాంగ్రెస్
నాయకులు*

ప్రశ్న ఆయుధం న్యూస్ రంగారెడ్డి జిల్లా డిసెంబర్-27

రంగారెడ్డి జిల్లా బాలాపూర్
పరిధిలోని యువజన కాంగ్రెస్
ఉపాధ్యక్షులు వరికుప్పల్ల శివ అద్వర్యం లో
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణాన్ని చింతిస్తూ, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కొవ్వాతులను వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది.

IMG 20241228 WA0002

కార్యక్రమంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కార్యదర్శి నాగార్జున,రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిగురింత దయసాగర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సుభాన్ యాదవ్, కల్వకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాదెమోని దళపతి గౌడ్, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరిగాని సాయి, మహేశ్వరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొంతం సందీప్, బాలాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్, ఎన్ఎస్ యు ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతకింది రంజిత్, మరియు యువజన కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now