అత్యాచార నిందితుడిని పట్టుకున్న పోలీసులకు సన్మానం

అత్యాచార నిందితుడిని పట్టుకున్న పోలీసులకు సన్మానం

బాధిత మహిళకు అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 1:

పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో ఆదివారం రైస్ మిల్‌లో పనిచేసే బీహార్ కూలీ చేత అత్యాచారానికి గురైన మహిళను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పరామర్శించారు. బాధితురాలికి ధైర్యం చెబుతూ ప్రభుత్వ పథకాల ద్వారా అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఏఎస్‌పీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్‌లను శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ (లోకల్ బాడీస్) మధుసూదన్, ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వెంకటేశ్, సఖి సెంటర్ మేడమ్స్, డీబీఎఫ్ సభ్యుడు శంకర్, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయిలు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్‌రాజు, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మడి స్వామి, తమ్మడి రాజు, మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment