సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఫోరమ్ నాయకుల నివాళులు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ విగ్రహానికి ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర ఉద్యమం అనంతరం ఐదు వందలకు పైగా రాజరిక సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. నిజాం పాలన నుండి తెలంగాణా భారత యూనియన్‌లో చేరడానికి కూడా ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఉక్కు మనిషిగా దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచారని, ఉప ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి భారత నిర్మాణానికి బలమైన పునాది వేశారని తెలిపారు. పటేల్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు, సమగ్ర మోచి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మార్కంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment