మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి ఘన నివాళులు

మాజీరాష్ట్రపతికిఘననివాళి      

 

ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ” యువతకు స్ఫూర్తిదాయకుడు మార్గ నిర్దేశకుడు క్షిపణి పితామహుడు జీవితకాలమంతయు దేశ ప్రగతి కోసం పరితపించిన గొప్ప దేశభక్తుడు మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రముఖ వ్యాపారి సామాజికవేత ఎం శ్రీనివాస్ కుమార్.మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన పరిశోధనల ద్వారా అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రపతిగా తన సేవలను దేశానికి అందించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక శాస్త్రవేత్తగా క్షిపణి పితామహుడుగా భారతదేశానికి తన సేవలను అందించారు. క్షిపణి ప్రయోగం ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటినాడు. తన సామర్థ్యం ద్వారా ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశ కూడా పోటీపడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. గొప్ప ప్రజ్ఞాశాలి 1931 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులద్దీన్ ఆసియమ్మ దంపతులకు కలాం జన్మించారు. ఒక శాస్త్రవేత్తగా ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా భారతదేశాన్ని నిర్మించటంలో కలాం కృషి చాలా గొప్పది. భారతదేశంనికి రాష్ట్రపతిగా సేవలందించిన గొప్ప మహానుభావుడని ప్రముఖ వ్యాపారి సామాజిక సామాజికవేత్త ఎం . శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now