శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ విశ్వకర్మ మహా సభ జిల్లా అధ్యక్షులు గంగా మోహన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్ వద్ద ఉన్న శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గంగా మోహన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి త్యాగాలు యావత్ తెలంగాణకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి. ఎల్. యన్. చారి, రంగోలి రాజయ్య చారి, భోజ రాజేశ్వర్ చారి, ధనుంజయ చారి, బ్రహ్మయ్య చారి, నరేష్ చారి, కొండూరు నరసయ్య చారి, తదితరులు పాల్గొని అమరుడికి జోహార్లు అర్పించారు.