ఏరియా ఎస్ ఓ టూ జిఎం డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు
మణుగూరు ఏరియా పివి కాలనీలో రోడ్ల ఇరువైపులా విపరీతంగా పెరిగి వాహనదారులకు స్కూల్ బస్సులకు ఇబ్బందికరంగా తయారైన చెట్ల కొమ్మలు ట్రిమ్మింగ్ చేయించాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు బుధవారం నాడు ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యాంసుందర్ గారికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పీవీ కాలనీ సివిల్-2 ఆఫీస్ నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ వరకు గల రోడ్డుకు ఇరువైపులా డివైడర్ మధ్యలో చెట్ల కొమ్మలు పెరిగి వచ్చిపోయే వాహనాలకు దారి కనిపించడం లేదనీ స్కూల్ బస్సుల్లో విద్యార్థులకు కిటికీ నుంచి చేతులకు మొహానికి తాకుతూ ఉన్నాయనీ కావున యాజమాన్యం స్పందించి వెంటనే చెట్ల కొమ్మలు ట్రిమ్మింగ్ చేసి సమస్య పరిష్కరించగలరని కోరారు.