ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్.. సీరియ‌స్ అయిన విజ‌య‌శాంతి

*ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్.. సీరియ‌స్ అయిన విజ‌య‌శాంతి*

ఏపీ డిప్యూటీ సీఎం అన్నా లెజినోవా తిరుమ‌ల యాత్ర ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత రెండు రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చ‌ర్చిస్తుంది. త‌న కొడుకు మార్క్ శంక‌ర్ అగ్ని ప్ర‌మాదంలో చిక్కుకొని తృటిలో ప్రాణాపాయం నుండి త‌ప్పించుకోవ‌డంతో అన్నా లెజినోవా తిరుమ‌ల‌కి వ‌చ్చి మొక్కు చెల్లించుకుంది. త‌ల‌నీలాలు కూడా స‌మ‌ర్పించింది. నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం.. ఆచారాలు అన్నీ పాటించ‌డం, తను స్వయంగా విరాళం అందజేసి అన్నదానం చేయ‌డం చాలా మందిని క‌దిలించింది. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ హిందూ ధర్మాన్ని అన్నా లెజినోవా న‌మ్మ‌డం గొప్ప విష‌యం అని చాలా మంది పొగిడారు.

కాని కొంద‌రు మాత్రం అన్నా లెజినోవాని ట్రోల్ చేస్తున్నారు. క్రిస్టియ‌న్ అయి ఉండి తిరుమ‌ల‌కి రావ‌డం ఏంటి, మ‌హిళ అయి ఉండి త‌ల‌నీలాలు స‌మర్పించ‌డం ఏంట‌ని కొందరు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. వారంద‌రికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి గ‌ట్టి స‌మాధానం ఇచ్చారు. త‌న ఎక్స్‌లో దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం.

అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్.. జై తెలంగాణ.. విజయశాంతి అంటూ రాసుకొచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌ని విమ‌ర్శిస్తున్న సమ‌యంలో తోటి మ‌హిళ‌గా విజ‌య‌శాంతి ముందుకు వ‌చ్చి స‌పోర్ట్ చేయ‌డం చాలా గొప్ప ప‌రిణామం అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక విజ‌య‌శాంతి న‌టించిన అర్జున్ స‌న్ ఆఫ్ విజ‌య‌శాంతి చిత్రం ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment