Site icon PRASHNA AYUDHAM

ఓ మనిషీ….?

మనిషీ
Headlines:
  1. బంధువులు, రక్తసంబంధాలు మరియు సామాజిక సంబంధాల ప్రాముఖ్యత
  2. అనుభవాలు, పాఠాలు మరియు మంచితనం: ఒక నాటి సత్యాలు
  3. జీవితం చివరి దశ: మరణం తర్వాత మనసులో ఏం ఉంటుంది?
  4. ఉద్దీపన: నేడు బ్రతకడం ఎలా?
  5. నీ పేరును చెబితే జనం ఎలా స్పందిస్తారు?

ఎక్కడ_నీ_బంధుగణం!?

ఎక్కడ_నీ_రక్తసంబంధం!?

ఎక్కడ_నీ_ఆత్మీయబృందం!?

ఎక్కడ_నీ_కులం!?

ఎక్కడ ..!?

పట్టు వస్త్రాలు పరుల పాలు

పట్టు పరుపులు చాకలి పాలు

ఆస్తి,పాస్తులు బిడ్డల పాలు

విర్రవీగిన దేహం మట్టిపాలు

మరి నీవేంటి..!?

గుక్కెడు తులసి జలం

నోట్లో గుప్పెడు బియ్యం

తలపై రూపాయి నాణెం

ఒంటిపై తెల్లని వస్త్రం

ఇవి కూడా బూడిద పాలే

వీటి కోసమా..!?

పగలు_ప్రతీకరాలు

మోసపు జీవితాలు

నాటకపు బ్రతుకులు

కుళ్ళు_కుతంత్రాలు

నయవంచనలు

నమ్మకద్రోహాలు

నీతోవచ్చేది_ఎవరు_వచ్చేదేంటి..!?

భార్య ఇంటి గుమ్మం వరకు

బిడ్డలు కట్టె కాలే వరకు

బంధువులు స్మశానం వరకు

కానీ నీ మంచితనం నీవు అస్తమించినా

ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.

నీ_బ్రతుకు_ఎలా_ఉండాలంటే

నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..

నీ మరణం ఎలా ఉండాలంటే

దేహం_కాలిబూడిదైనా_

నలుగురు_గొప్పగా_చెప్పుకునేలా_

ఉండాలిజీవితం..//

నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి…!

అలా బ్రతకాలి ఓ మనిషీ

Exit mobile version