తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.
మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చ.
ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.
ఈ నెల 24న ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు.
భక్తుల రద్దీ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చ.
మరికొన్ని అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్న టీటీడీ బోర్డు.