విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now