సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించకపోవడం చాలా దారుణమని అన్నారు. వెంటనే 4 డీఏలను ప్రకటించాలని ఆయన తెలిపారు. అలాగే పీఆర్ సీని కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు యం.శంకర్, జిల్లా మహిళా కార్యదర్శి సుమాళిని, సదాశివపేట మండల అధ్యక్షులు సి.ఎచ్ జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి ఇ.జగదీశ్వర్, నాయకులు వీరేశం, భూదేవి, భాగ్యశ్రీ, రాజు, లత, మంగ, శ్రీశైలం, రమేష్, మోసిన్, ఆనంద్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
*సదాశివపేట మండల కమిటీ ఏకగ్రీవం*
అనంతరం సదాశివపేట మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సి.హెచ్.జగన్మోహన్, ప్రదాన కార్యదర్శిగా ఇ.జగదీశ్వర్, కోశాధికారి శ్రీశైలం, ఉపాధ్యక్షుడు పొన్న రమేష్, మహిళా కార్యదర్శి మంగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.