క్షయ వ్యాధి నివారణ పౌష్టిక ఆహారం తీసుకోవడం

*క్షయ వ్యాధి నివారణ పౌష్టిక ఆహారం తీసుకోవడం* 

*ప్రభుత్వం ఇచ్చే న్యూట్రిషన్ కిట్టు సద్వినియోగం చేసుకోవాలి*

*మండల వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్*

*ఇల్లందకుంట ఏప్రిల్ 3 ప్రశ్న ఆయుధం*

క్షయ వ్యాధి నివారణకు మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ తులసీదాస్ తెలిపారు గురువారం రోజున జిల్లా క్షయ నియంత్రణ సంస్థ జమ్మికుంట టిబి యూనిట్ ఆధ్వర్యంలో ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో టిబి మందులు వాడుతున్న వారికి నీక్షయ్ పోషణ యోజన పథకం లో భాగంగా పోషకాహారం నిమిత్తం నెలకు రూ 1000 అందించడం జరుగుతుందని తెలిపారు వీటితో పాటు అదనంగా ఈ నెల న్యుట్రీషన్ కిట్ (నిత్యావసర సరుకులు) అందించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ తులసీదాస్ మాట్లాడుతూ సరియిన టిబి మందులు పూర్తి కోర్సు 6 నెలలు వాడితే టిబి వ్యాది పూర్తిగా నయం అవుతుందని ప్రభుత్వం అందించే ఉచిత మందులతో పాటు నెలకు రూ 1000 నుట్రిషన్ కిట్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసీదాస్ తో పాటు డాక్టర్ కళ్యాణ్, సిహెచ్ఓ శ్యామల, సూపర్వైజర్ శ్రీనివాస్, టిబి సూపర్వైజర్ దేవేందర్ రెడ్డి, స్టాఫ్ నర్స్ మానస ఎన్జీవో నుండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment