తులసి అంటే మొక్క కాదు.. మన అమ్మ కూడా: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

సిద్దిపేట/గజ్వేల్, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తులసి అంటే మొక్క కాదు.. మన అమ్మ కూడా అని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి పవిత్రమైన రోజును పురస్కరించుకొని ఆదివారం నాడు అద్దాల మందిరం వద్ద తులసి మాతకు, ఉసిరి మొక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ.. తులసి అంటే మొక్క కాదు.. మన అమ్మ కూడా అని తెలిపారు. ఈరోజు తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్కను ఉంచి విష్ణు మూర్తికి పూజలు చేస్తారన్నారు. దీపాలు వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజ చేస్తారని, వీటినే ద్వాదశ దీపాలు అంటామన్నారు. ఈరోజు ప్రతి ఇంటా దీపాల వేలుగులతో నిండి పోతుందన్నారు. ఇంటిలో ఉన్న తులసికోట వద్ద శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమానులైన తులసిని పూజిస్తే సకల శుభాలు కల్గుతాయని రామకోటి రామరాజు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment