Site icon PRASHNA AYUDHAM

గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మ కృష్ణ

IMG 20250816 WA0059

గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మ కృష్ణ

సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా తుమ్మ కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక.

మర్కుక్ మండలం, ఎర్రవల్లి గ్రామానికి చెందిన తుమ్మ కృష్ణ.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ భవనంలో తల్లిదండ్రుల సమావేశం.

నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వెంకటేశ్వర్లు అందజేత.

ప్రశ్న ఆయుధం సిద్దిపేట, ఆగస్టు 17

తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన తుమ్మ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేఆర్ భవనంలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వెంకటేశ్వర్లు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని వివిధ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version