Site icon PRASHNA AYUDHAM

పగడాల కిషోర్ ఆధ్వర్యంలో అన్నం సేవా ఫౌండేషన్ లో తుమ్మల జన్మదిన వేడుకలు

IMG 20241115 WA0274

ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు పూజలు తుమ్మల నాగేశ్వరావు జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ నాయకులు పగడాల కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో అన్నం సేవా ఫౌండేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది అనాధలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసి వారి మధ్య తుమ్మల గారి జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేసి వారితోపాటు ఆనందం పంచుకున్నారు.ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తుమ్మల సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని పేద ప్రజలకు ఇంకా మరింత సేవ చేయడానికి ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయుషు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు మచ్చలేని మహానాయకుడు అభివృద్ధి తప్ప వేరే ధ్యాసలేని రాజకీయ దురదరుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, తన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అనేక మంత్రి పదవులు అలంకరించి అట్టడుగు వర్గాలకు చేయుచున్నందించి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నే ఉన్నత స్థానం లో నిలబెట్టారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఆసిఫ్ షెట్టి రంగారావు నగర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ సముద్రాల శ్రీనివాసరావు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి తుపాకుల మధు మేకల అశోక్ నాంపల్లి శంకరయ్య నరసింహారావు శీలం గోపాల్ రెడ్డి అన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version