ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 18 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, శివ్వంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి పర్యటించారు. గత రాత్రి గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.