*ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పసుపు రైతుల పాలాభిషేకం…*
–
– తమ దశాబ్దాల కళ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేసిన పసుపు రైతులు
*నిర్మల్ ,జనవరి 27 గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం జరిగింది. దీంతో తమ సరిహద్దు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గడ్చందా గ్రామానికి చెందిన పోగుల సాయన్న యొక్క పసుపు వ్యవసాయ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పసుపు రైతులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు సాయన్న మాట్లాడుతూ గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నిజామాబాదులో నరేంద్ర మోడీ జనసభలో పసుపు బోర్డు నిజామాబాదు జిల్లాలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలం పాటు కసరత్తు చేసి ఈ సంవత్సరం సంక్రాంతి రోజు రైతులకు మోడీ గ్యారెంటీ కింద వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. పసుపు బోర్డు ద్వారా నూతన పసుపు వంగడాల ఉత్పత్తి చేయడం, పరిశోధనలు చేయడం,పసుపు పంటలకు మంచి ధరలు కల్పించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయంగా మార్కెట్ అవకాశాలను సృష్టించడం, పసుపు ఉత్పత్తి కర్మగారాలను తయారు చేయడం,పసుపుని వివిధ పరిశ్రమలకు అనుసంధానించడం, పసుపు సాగు యాజమాన్యంలో సాంకేతికతను జోడించి ఉత్పత్తి పెంచడం, సబ్సిడీల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.
గత 30 సంవత్సరాల నుండి నిజామాబాద్,కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ మరియు తెలంగాణలోని పసుపు పండించే రైతులు జాతీయ పసుపు బోర్డు కోసము ఎంతగానో పోరాడిన స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రైతుల పక్షాన నిలబడి పసుపు బోర్డు కోసం అహర్నిశలు శ్రమించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జాతీయ పసుపు బోర్డుని ఏర్పరచడం చాలా లాభదాయకం మరియు శుభ సూచకమని అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, గడ్చందా మాజీ ఎంపిటిసి జీవన్,మండల ఓబీసీ మోర్చా కార్యదర్శి ఒడ్నాల మురళి , మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అనసూయ, పసుపు రైతులు విలాస్,మాజీ సర్పంచ్ భూమన్న ,దేవేందర్, ప్రశాంత్, కాసు భూమన్న, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.