తెలంగాణ మహాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం (టి యు ఎస్) ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్డు సెంటర్లో ఉన్న ఇండోర్ స్టేడియం గ్రౌండ్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ కే పాషా, గౌరవరపు జగదీష్ మాట్లాడుతూ అమరజీవి కాళోజి తన జీవితాంతం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడారని కొనియాడారు తెలంగాణ గొడవ తన గొడవగా భావించిన కవి కాళోజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన గొప్ప కవి అని పేర్కొన్నారు. ఒక్క చిరాచుక్క లక్షల మెదడులను కదిలిస్తుందని ఆయన కలం ద్వారా తెలంగాణలోని లక్షలాది మెదడులను కదిలించి ప్రజలను తెలంగాణ ఉద్యమ వైపు ఉరక లెక్కించిన మహాకవి కాళోజి అని కొని ఆడారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు యమల గోపాలరావు, పూర్ణకటి రామారావు, ఉపాధ్యక్షులు సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్, ప్రచార కార్యదర్శి షేక్ లాల్ మియా, ఓర్సు శ్రీనివాసరావు, కోశాధికారి నాయకులు నల్లగట్ల బాబు, నాగుల మీరా, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
Latest News
