– వరద బాధిత తిరుమలరావు, తిరుపతిలకు ఆర్థిక సాయం
– రూ.5వేల చొప్పున అందించిన జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్
– మరిపెడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి అభినందన
– నిధికి అత్యధిక చేయూతనందిచినందుకు సత్కారం
మరిపెడ: నిరుపేద జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఎప్పుడు అండగా ఉంటుందని, ఆకేరు వరదతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లేపల్లి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చేయూతనందిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన వరద ముంపునకు గురైన ఉల్లేపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టులు వంకాయలపాటి తిరుమలరావు, మాలోతు తిరుపతి లను సభ్యులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారికి యూనియన్ తరపున రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లేపల్లిలో ఇందటి ఉపద్రవం ఊహించని పరిణామమని, తెల్లవారుజామున వరద ఉధృతి రావటంతో గ్రామంలో అంతా మేల్కొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు. కష్టసమయంలో యూనియన్ జర్నలిస్టులకు అండగా నిలుస్తుందన్నారు. సంఘము ఆధ్వర్యంలో తిరుమల రావు, తిరుపతి నాయక్ లకు వారిద్దరికొకంటికి 5వేల రూపాయల చొప్పున 10 వేల రూపాయలను ఆర్థిక తోడ్పాటును అందించి చేయూత నిచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. అంతేగాక ఇటీవల కాలంలో వరద బాధితుల కోసం టియుడబ్ల్యూ జే (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సహకారంతో సీఎం సహాయక నిధిని సేకరించినట్లు తెలిపారు. దానికి మరిపెడ మండలం నుండి కృషిచేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యం డీ రియాజ్ పాషా ను ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంధసిరి రవి, జిల్లా సహాయ కార్యదర్శి జిన్న లచ్చయ్య, మరిపెడ మండలం కార్యదర్శి మచ్చ రాజేష్, కురవి మండల అధ్యక్షులు గుంటిసురేష్,జర్నలిస్టులు పసునూటి వేణుగోపాల్, పోతుల గోవర్ధన్, బోడ శ్రీనివాస్, ప్రవీణ్ నాయక్, శ్రీ కుమార్,తదితరులు ఉన్నారు.