Headlines :
-
భద్రాద్రి కొత్తగూడెంలో గంజాయి తరలింపులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
-
సుజాతనగర్ వద్ద పోలీసుల తనిఖీల్లో 84 కిలోల గంజాయి స్వాధీనం
-
జహీరాబాద్ కు చెందిన వ్యక్తులు అరెస్ట్, కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న 84 కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నామని ఎస్సై జుబేదా తెలిపారు. జహీరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సీలేరు అడవి ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.