నిజాంసాగర్ ప్రశ్న ఆయుధం జులై22
కళ్యాణి ప్రాజెక్టులోకి 650 ఇన్ ఫ్లో రావడంతో రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సోమవారం 650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. దీంతో కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉందని ఎగువ నుండి వస్తున్న నీటిని ప్రాజెక్టు నిండుకోవడంతో నీటిని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 450 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు. ప్రధాన కాలువలోకి సోమవారం విడుదలి చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వర్ధనీటితో ప్రవహిస్తునందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పశువుల కాపర్లు అటువైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు.