Site icon PRASHNA AYUDHAM

ఎదురెదురుగా ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు?

IMG 20250809 WA2683

ఎదురెదురుగా ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు?

హైదరాబాద్ :ఆగస్టు09

పట్టాలు తప్పిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీ కొట్టిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో శనివారం ఉదయం తెల్లవారు జామున చోటు చేసుకుంది,

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గూడ్స్ రైలు ఇనుము లోడ్‌తో టాటా నగర్ నుంచి పురులియా వైపు వెళ్తుండగా చాందిల్ స్టేషన్‌ సమీపంలోని పిటాకీ గేట్ 200 మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది.

అదే సమయంలో మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ట్రైన్ డ్రైవర్లు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

యుద్ద ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 200 మీటర్ల వరకు రైల్వే ట్రాక్కులు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Exit mobile version