*గండివేట్ గ్రామంలో రెండు హై మాక్స్ లైట్లు*
*రెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన హై మాక్స్ లైటింగ్స్*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 30
ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు కృషితో లైటింగ్ ఏర్పాటు
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభం.
గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
గ్రామ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం విశేషం
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో సుమారుగా రెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు హై మాక్స్ సెంట్రల్ లైటింగ్స్‌ను ప్రారంభించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ ఆధ్వర్యంలో లైట్స్ ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సాయి బాబా, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాశ్, కాశీరాం, యాసిక్, సాగర్, చిన్న కాశీరాం, ప్రకాశ్ రామ్, చాకలి సాయిలు, మంగలి గంగారం, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో మెరుగైన రహదారి రక్షణ మరియు రాత్రి వేళ ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ లైటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు.