చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లలో దొంగల బీభత్సం

*చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లలో దొంగల బీభత్సం*

IMG 20250507 WA1330 ఆయుధం న్యూస్ 07 మే కామారెడ్డి జిల్లా.

గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామంలో కుమ్మరి రోజా అదే గ్రామంలో వడ్ల రమేష్ ఇంట్లో కిరాయికి ఉంటుంది. మంగళవారం రాత్రి తన కిరాయికి ఉంటున్న ఇల్లుకు తాళం వేసి రాత్రి అదే గ్రామంలో గల తన తల్లిగారింట్లో పడుకోడానికి పోగా, అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన ఇంటి పక్కన కిరాయి కి ఉంటున్న చాకలి శంకర్, కుమ్మరి రోజకు ఫోన్ చేసి మీ ఇంటి తాళం కోసి తలుపులు తెరిచి ఉన్నాయని తెలుపగా వెంటనే ఆమె వచ్చి చూడగా ఇంట్లో గల దాదాపు ఏడున్నర మాసాల బంగారము, 12 తులాల వెండి మరియు కొంత నగదు పోయినది అని చెప్పడం జరిగింది .గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అలాగే అదే గ్రామంలో ఆ ఇంటికి దగ్గరలో గల కొర్రి గౌరవ్వ నిన్న రాత్రి బయట పడుకోగా వర్షం పడుతున్న సమయాన . తాను నివసిస్తున్న ఇంట్లోకి వెళ్లి తర్వాత తలుపులు పెట్టుకోక పోవడంతో ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లో గల నగదు 12 తులాల వెండి మరియు మెడలో గల బంగారు గుండ్లను ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడడం జరిగింది. గౌరవ ఫిర్యాదు ఇవ్వగా . ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ దొంగతనం జరిగిన ప్రదేశాలను. పరిశీలించడం జరిగింది.

Join WhatsApp

Join Now