నిజామాబాద్ డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30
నిజామాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో తనిఖీలు చేస్తుండగా మద్యం సేవించి బైక్‌లు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేశారు. అనంతరం సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా శ్రీనివాస్‌కు ఒకరోజు, శంకర్‌కు రెండురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే మరో 25 మందికి రూ. 3,500 జరిమానా విధించారు.