రెండు లక్షల ప్రమాద బీమా అందజేత

రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

బిఆర్ఎస్ శ్రేణులకు అండగా బిఆర్ఎస్

దేశంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బిఆర్ఎస్

గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

గజ్వేల్ డిసెంబర్ 08 ప్రశ్న ఆయుధం :

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పూర్తి అండగా బిఆర్ఎస్ ఉంటుందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్, గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గత కొన్ని రోజుల క్రితం గజ్వేల్ పట్టణం పదో వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చిక్కుడు కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం గజ్వేల్ లోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో బిఆర్ఎస్ పార్టీ నుండి మంజూరైన ప్రమాద బీమా రెండు లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు వంటేరు ప్రతాప్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని పార్టీ కార్యకర్త చిక్కుడు కిరణ్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే దాదాపు 97,500 సభ్యత్వాలు కలిగి ఉన్న పార్టీ అన్నారు. దాదాపు ఇప్పటివరకు 380 మృతుల కుటుంబ సభ్యులకు7 కోట్ల 60 లక్షల రూపాయలు బిఆర్ఎస్ ప్రమాద బీమా నుండి అందించడం జరిగిందన్నారు, కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ప్రమాద బీమా లాంటి సౌకర్యాన్ని కల్పించారన్నారు, భారతదేశంలోని ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఇలాంటి సౌకర్యాన్ని కల్పించలేదన్నారు. రాబోయే ఎన్నికలలో అధికారం మనదే అని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను కాంగ్రెస్ పథకాల అమలుకు నిరంతరం ప్రశ్నిస్తూ ఉండాలని, కాంగ్రెస్ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయిద్ధిన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్ మీరా, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, నాయకులు ఆకుల దేవేందర్, గుంటుకు రాజు, బాబా షేర్ అలీ, ఉమర్, అహ్మద్, పాల రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now