గత అసేంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండా రైతులందరికి ఇచ్చిన హమీ ప్రకారం 2 లక్షల రుణమఫీ వేంటనే అమలుచేసి వేంటనె రైతుల ఖాతల్లో వేయలని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసన సభ్యులు గంప గోవర్ధన్, బి ఆర్ ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె. ముజీబోద్దీవ్ ఆదేశాలమేరకు గురువారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ తరపున హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తున్న పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలిస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో బి ఆర్ ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అద్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ పట్టణ అద్యకులు మాజీ కౌన్సిలర్ మల్లన్నగారి భూంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గెరిగంటి లక్ష్మినారాయణ, అన్నారం నరేష్ రెడ్డిలు ఉన్నారు.