రెండు లక్షల రుణమాఫీ రైతుల అందరికీ చేయాలి……

రెండు లక్షల రుణమాఫీ రైతుల అందరికీ చేయాలి……

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్.

రెబ్బెన సహకార సంఘం పాలకవర్గాన్ని పూర్తిగా రద్దు చేయాలి..

IMG 20240823 WA0090

రైతు సహకార సంఘం అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేసి. అవినీతికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి.రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని. రైతు సహకార సంఘం లో అవినీతికి పాల్పడిన అధికారులు పాలకవర్గం పై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని బిజెపి ఆధ్వర్యంలో రైతు వేదిక కార్యాలయం ముందు నిరాహార దీక్షా లో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రిల పేరుతో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఇంకా 70% రైతులకురుణమాఫీ కాలేదని ప్రజలు తాము ఓట్లు వేసిన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీయాలని తమ తరపున పోరాటం చేయాలని రైతులు అడగాలని రైతులందరికీ నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ మొత్తం రూ.2 లక్షల రుణంమాఫీ చేసే వరకు బిజెపి వదిలిపెట్టబోదని రేబ్బన సహకార సంఘంలో పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడి అప్పులు తీసుకొని రైతులకు వారు తెలియకుండానే వారి పేరు మీద అప్పులను తీసుకొని మరియు చనిపోయిన రైతులను పేరుమీద లోను రెన్యువల్ చేసి రైతు రుణమాఫీలను కాజేయడం అదేవిధంగా అప్పులను క్లియర్ చేసిన ఇక్కడ అదేవిధంగా పెండింగ్ గా ఉండడంతో ఇతర బ్యాంకులలో లోన్లు మాఫీ కాక రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులను నట్టేట ముంచిర్రని రైతులకు రుణా మాఫీ అయ్యేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరపాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కటై కాంగ్రెస్ 420 హామీలను ప్రజలూ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే’ఖరీఫ్ సీజను దాటిపోతుందని రైతుబంధు ను కూడా వెంటనే ఇవ్వాలని రెబ్బెన సహకార సంఘంలో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు గుల్భం చక్రపాణి. జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, జగన్నాథ ఓదెలు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్ వెలసి మోర్చ మండల అధ్యక్షులు డోంగిరి నందకిషోర్. గోలేటి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేష్. ఉపాధ్యక్షులు జటంగుల శ్రీశైలం. కుందారపు నాగేష్ వడ్లూరి లింగయ్య మస్కా లక్ష్మణ్. పోతురాజుల నారాయణ. బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now