*ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి*
భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం నుండి అడవులను గాలిస్తున్న భద్రతా బలగాలకు శనివారం ఉదయం మావోలు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతుండగా… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.