Site icon PRASHNA AYUDHAM

బీచ్ స్నానానికి వెళ్లి విషాదం… ఇద్దరు గల్లంతు

Screenshot 2025 04 20 12 13 08 626 edit com.whatsapp

*బీచ్ స్నానానికి వెళ్లి విషాదం… ఇద్దరు గల్లంతు*

జిల్లా, ఏప్రిల్ 20: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో గుడ్ ఫ్రైడే సందర్భంగా స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నల్లజర్ల మండలం ప్రకాశ్‌పాలెంకు చెందిన ఉదయ్, మరో వ్యక్తితో కలిసి బీచ్‌కు వచ్చారు. స్నానం చేస్తుండగా భారీ అలల మధ్య వారిని సముద్రం లోపలికి తీసుకెళ్లింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఉదయ్‌ను గుర్తించి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరో వ్యక్తి కోసం బీచ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో బీచ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగరోజున ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version