
ఆలమూరు మండలంలోని చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.అశోక్ తెలియజేశారు. ఈనెల 17వ తేదీన చొప్పెల్ల కొండాలమ్మ గుడి సమీపంలో రెండు వేరు వేరు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వ్యక్తులు రోడ్డు డివైడర్ దాటే క్రమంలో వ్యాన్ దూసుకు వెళ్లడంతో గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అడబాల సత్యనారాయణ (57) ఆదివారం మృతిచెందగా, ఆకుల వెంకన్న (45) సోమవారం మృతి చెందినట్లు, దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనలో గ్రామమంతటా విషాదఛాయలు అలుముకున్నాయి._