అక్రమంగా నాటు సారా కేసు లో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

అక్రమంగా నాటు సారా కేసు లో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 20 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు

జియ్యమ్మ వలస మండలం చిన మెరంగి గ్రామంలో , కురుపాం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు వారి సిబ్బంది తో కలిసి

అక్రమంగా నాటు సారా రవాణా గూర్చి వచ్చిన సమాచారం లో భాగంగా దారి కాపలా చేసి 60 లీటర్ల నాటు సారాయీ రవాణా చేస్తున్న చినమేంగి కి చెందిన సంభాన విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతడి వద్దనుండి 60 లీటర్ నాటు సారా ను స్వాధీనం చేసుకొని , నాటు సారాయీ రవాణా కి ఉపయోగించిన పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్ చేసి ఇతడికి నాటు సారా సప్లయ్ చేస్తున్న రాయగడ జిల్లా కెరడా గ్రామానికి చెందిన చీంతాడ చిరంజీవి పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తము కోర్టు లో హాజరు పరిచారు. ఇతడిపై గతంలో కూడా కేసు నమోదు చేసి బైండోవర్ చేశామని తదుపరి మండల excutive magistrate ముందు హాజరు పరిచి అపరాధ రుసుమును కూడా వసూలు చేస్తామని చెప్పారు.

ఈ సందర్బంగా సీఐ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామలలో నాటుసారా తయారీ రవాణా,అమ్మకాలు చేసి ప్రజలు ఆరోగ్యంనికి హాని కలిగిస్తే అటువంటి వారిపై PD చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు.తెలుపుతూ నవోదయ 2.0 లో భాగంగా గ్రామాలను నాటు సారా లేని గ్రీన్ విలెజ్ గా ప్రకటించ డానికి ప్రజలు, ప్రజా ప్రతినిధులు , అధికారులు అందరు సంహకరించాలని కోరడమైనది .

. ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment