ఇద్దరు వ్యక్తుల వద్ద ఎండు గాంజా స్వాధీనం

ఇద్దరు వ్యక్తుల వద్ద ఎండు గాంజా స్వాధీనం

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 27, కామారెడ్డి :

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఎన్ డి పిఎస్ ప్రత్యేక రైడ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి డి హనుమంతరావు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది శుక్రవారం సదాశివ్ నగర్ మండలంలోని వజ్జే పల్లి గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామిండ్ల రాజశేఖర్ అనే వ్యక్తి వద్ద 70 గ్రాముల ఎండు గాంజా లభించిందని తెలిపారు. అతన్ని విచారించగా అతను యాచారం గ్రామానికి చెందిన తిరుపతి వద్ద ఎండు గాంజా తీసుకున్నట్లు తెలిపాడు. అతని వద్ద కూడా సోదా చేయగా 70 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, ఈ సందర్భంగా నిందితుల ఇద్దరిపై కేసు నమోదు చేసి ఒక బైకు, 140 గ్రాముల ఎండు గాంజా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా ఎటువంటి మత్తు పదార్థాలను సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై విక్రంకుమార్, సిబ్బంది మైసరాజు, సంతోష్ రాథోడ్, ఆంజనేయులు, దేవకుమార్, రమ, శ్రీ రాగ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now