బాబాయిని చంపిన కొడుకు కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు అరెస్టు
తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి
వెల్దుర్తి మండలం ఫిబ్రవరి 5
మెదక్ జిల్లా శివంపేట మండలం తిక్క దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య తండా లో ఈనెల 1వ తేదీన జరిగిన మాలోత్ మదన్ లాల్ హత్య కేసును పోలీసులు చేదించారు. తూప్రాన్ డిఎస్పి కార్యాలయంలో బుధవారం డిఎస్పి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మృతుడు మదన్లాల్ అన్న కుమారుడు భరత్ ఫ్రెండ్ అనే యువకుడు తన స్నేహితుడైన మేకల నవీన్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భరత్ సేన్ కుటుంబానికి మృతుడి కుటుంబానికి భోగి బాదం నెలకొందని గతంలో 2016 సంవత్సరంలో మృతుని అన్న తారా సింగ్ మృతిచెందగా దానికి కారణం మదన్లాల్ అని భావించిన నిందితుడు భరత్ సెన్ హత్య చేసేందుకు పథకం రచించి ఈ నెల ఒకటో తేదీన మాట్లాడుకుందామని వెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ రంగాకృష్ణ శివంపేట ఎస్సై పాల్గొన్నారు