సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది 30వేలు రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వెంకటేశ్ యాదవ్ అనే వ్యక్తికి భూమి పట్టా పాస్ పుస్తకం కోసం ధరణి ఆపరేటర్ అరుణ్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ 30వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అరుణ్, సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు.
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు సిబ్బంది
Oplus_0