ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్
ప్రశ్నాయుధం న్యూస్, నవంబర్ 12, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.