విషాదం.. నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి
Mar 01, 2025,
విషాదం.. నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు యువకులు సరదాగా ఈత కొడదామని ఏడుపాయల వద్ద నదిలోకి దిగారు. అయితే అలల ధాటికి నలుగురు యువకుల్లో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు యువలకు మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.